COVID-19 మహమ్మారి మన మానసిక ఆరోగ్యంపైన భారీగా ప్రభావాన్ని చూపుతోంది మరియు ముఖ్యంగా టీనేజర్ల విషయంలో ఇది దుర్బలంగా ఉంటుంది. వారి మెదుడు ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంటుంది, మరియు వారికి ఇంకా చాలా జీవితానుభవాలు ఉండవు కాబట్టి, వారు అనుభూతి చెందే – విషాదం, కోపం, ఒత్తిడి, మరియు ఒంటరితనం— ఇవన్నీ కూడా చాలా తీవ్రంగా ఉంటాయి. COVID-19 మహమ్మారి సమయంలో, టీనేజర్లో ఒక మాదిరి నుంచి తీవ్రమైన వ్యాకులత లేదా ఆతురత వంటి లక్షణాలను కనిపించే అవకాశం ఎక్కువగా ఉంటుందని పరిశోధన తెలియజేస్తోంది. (Mental Health America). సెప్టెంబర్ 2020 లో సగానికి పైగా టీనేజర్లు ఆత్మహత్య లేదా స్వీయ-హాని ఆలోచనలు కలుగుతాయని నివేదించారు (Mental Health America).
శుభవార్త ఏమిటంటే, తల్లిదండ్రులు మరియు ఇతర నమ్మకమైన పెద్దలు సహాయం చేయవచ్చు.
లక్షణాలను తెలుసుకోండి
లక్షణాలను గుర్తించడం మొదటి దశ. ప్రతి టీనేజర్ భిన్నంగా ఉంటారు మరియు బాధాకరమైన సంఘటనలకు వారి ప్రతిస్పందన వేర్వేరుగా ఉంటుంది. “Acting out” నుండి “acting in” వరకు ఉండవచ్చు. “Acting out” లో మాదక ద్రవ్యాలు ఉపయోగించడం, గొడవలకు దిగడం, లేదా COVID-19 గురించిన భద్రతా మార్గదర్శకాలను విస్మరించడం వంటి ప్రమాదాలు తీసుకోవడం సహా ఉండవచ్చు. “Acting in” లో టీనేజ్ పిల్లలు ఇతరులను కలవకుండా ఉండటం, దేని గురించి పట్టించుకోనట్టు ఉండడం లేదా తరచుగా ఒంటరిగా ఉండాలని కోరుకోవడం వంటి లక్షణాలు ఉంటాయి. (Washington State Department of Health). విపత్తు సమయంలో మీ టీనేజర్ ల్లో కనిపించే ఇతర సాధారణ స్పందనలలో ఈ క్రిందివి ఉండవచ్చు:
- ఆందోలన చెందడం
- విచారంగా ఉండటం
- తప్పుచేసిన భావన, కోపం, భయం, నిరాశ అనుభూతి
- తమకు ఎలాంటి భవిష్యత్తు ఉండదనే భయం
- స్నేహితులను కలవక పోవడం లేదా స్నేహితులను మార్చడం వంటి సామాజిక ప్రవర్తనల్లో మార్పు
- భావోద్వేగాలను పరిహరించడానికి బిజీగా ఉండటం
- మద్యం లేదా మాదక ద్రవ్యాలు సేవించే చెడు అలవాటు
సహాయపడే మార్గాలు
తల్లిదండ్రులుగా, మీ టీనేజ్ పిల్లల జీవితంలో మీరు అత్యంత ప్రభావం చూపేంచే వ్యక్తి. వారు ఈ మాటను ఒప్పుకున్నా లేదా ఒప్పుకోకపైనా!
ఈ క్లిష్టకర సమయంలో టీనేజర్లు మరింత ఒంటరిగా ఉన్నట్టు భావించవచ్చు. వ్యక్తిగతంగా స్కోలుకు వెళ్ళకపోవడం, స్నేహితులను కలవకపోవడం, లేదా ఆటలు ఆడలేక పోవడం, వీటి వల్ల గతంలో వారికి లంభించిన మద్దతు లభించకపోవచ్చు. అందుకే, మీ టీనేజ్ పిల్లలతో మాట్లాడటం చాలా ముఖ్యం. మీరు సహాయ పడే మార్గాలను ఈ క్రింద ఇవ్వబడింది (Washington State Department of Health):
- ఈ విపత్తు సమయంలో స్వీయ-సంరక్షణకు నమూనాగా నిలవండి, మీ స్వంత భావోద్వేగాల గురించి మాట్లాడండి.
- టీనేజర్లు తమ ఆలోచనలు మరియు మనసులోని భావనలను వ్యక్తీకరించడానికి వారిని కౌమారదశలో ఉన్నవారిని ప్రోత్సహించండి. ఈ భావోద్వేగాలను గుర్తించి, వాటిని ఎదుర్కోవడానికి వారికి సహాయం చేయండి.
- వారు మాత్రమే ఇలా బాధపడటం లేదని, ప్రస్తుతానికి అంతా సజావుగా లేనప్పటికీ పర్వాలేదని వారికి గుర్తుచేయండి.
- ఒత్తిడిని ఎదుర్కోవడానికి స్వీయ రక్షణ, వ్యాయామం, ధ్యానం, బయటకు వెళ్ళడం లేదా వారికి సంతోషం, లేదా ప్రశాంతతను అందించే ఆరోగ్యకరవంతమైన మార్గాలను అభ్యసించడానికి వారిని ప్రోత్సహించండి. టీనేజర్లు, ఐడియాలను You Can వద్ద కనుగొనవచ్చు.
- ఒత్తిడిని ఎదుర్కొనేందుకు దిగువ పేర్కొన్న అనారోగ్యవంత మార్గాలను అనుసరించడం వల్ల కలిగే ప్రమాదాల గురించి చర్చించండి (ఉపన్యాసం ఇవ్వకండి):
- మద్యం లేదా మాదకద్రవ్యాలు సేవించడం
- హింసాత్మక లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనడం
- అనారోగ్యకర సంబంధాలు (రిలేషన్ షిప్) కలిగి ఉండటం
- మంచి నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడే స్నేహితులను ఎంచుకోవడం యొక్క ప్రాముఖ్యత గురించి చర్చించండి. కుటుంబం మరియు స్నేహితులతో బలమైన సంబంధాలను ఏర్పరుచుకునేందుకు ప్రోత్సహించండి.
- ఈ క్లిష్టమైన సమయంలో ఇతరులకు సహాయ పడటానికి వారికి అనుమతించండి మరియు ప్రోత్సహించండి. ఉదాహరణకు, పెరటిలో మొక్కలు పెంచడం, చెత్త తొలగించడం, చిన్న పిల్లల కోసం కార్యకలాపాలను నిర్వహించవచ్చు లేదా సరుకులు తేవడానికి పొరుగువారికి సహాయ పడవచ్చు.
- టీనేజర్లతో వారి భవిష్యత్తు గురించి మాట్లాడండి. ఉదాహరణకు, ఇలా అడగండి “వచ్చే సంవత్సరం లేదా రాబోయే 5 సంవత్సరాలలో మీరు ఏమి చేయాలనుకుంటున్నారు?” “ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీరు ఇప్పుడు ఏమి చేయవచ్చు?” “ఆ లక్ష్యాన్ని చేరుకునే దిశలో మిమ్మల్ని నడిపించే కొన్ని కార్యకలాపాల్లో నేను మీకు మీకు సహాయం చేయగల మార్గాలేమన్నా ఉన్నాయా?”
- మీ టీనేజ్ పిల్లలతో ఈ ట్రూథ్ లేదా ఛాలెంజ్ గేమ్ తో సరదాగా ఆకట్టుకునే విధంగా సంభాషణ ప్రారంభించండి.
మద్దతు పొందండి
Teen Link: కొన్ని సార్లు, మీ టీనేజ్ పిల్లలు తమ తోటివారితో మాట్లాడటానికి మరింత సౌకర్యవంతంగా భావించవచ్చు. ఫర్వాలేదు! ఒక గోప్య మరియు ఉచిత హెల్ప్ లైన్ ఉంది, ఇది సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల PT వరకు పని చేస్తొంది. ఇందులో శిక్షణ పొందిన సిబ్బంది పని చేస్తారు. మీ బిడ్డ వారి మనసులో ఉన్న సంగతి వారితో మాట్లాడవచ్చు. 1-866-TEENLINK (833-6546) సంఖ్యకు కాల్, టెక్స్ట్ చేయమని లేదా చాట్ చేయమని మీ బిడ్డను ప్రోత్సహించండి. మీరు కోరుకున్నట్లయితే, మీ బిడ్డ వారితో మాట్లాడే ముందు మీరే వాలంటీర్ తో మాట్లాడవచ్చు. మీ బిడ్డ మద్యం లేదా మాదక ద్రవ్యాలు ఉపయోగించడానికి సంబంధించన ఆందోళనల గురించి చర్చించడానికి కూడా మీరు హెల్ప్ లైన్ ని సంప్రదించవచ్చు.
Washington Listens: మీకు కూడా సహాయం లభిస్తుంది. ఉచిత మరియు అనామక సహాయం కోసం 1-833-681-0211 నంబర్ కు కాల్ చేయండి లేదా WAlistens.org సందర్శించండి. వాషింగ్టన్ లిసన్స్ (Washington Listens) COVID-19 వల్ల విచారం, ఆత్రుత లేదా ఒత్తిడికి గురైనట్టు భావించేవారికి మద్దతు అందిస్తుంది. దీనిలో సిబ్బంది సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 9 నుండి రాత్రి 9 PT, వారాంతల్లో ఉదయం 9 నుండి సాయంత్రం 6 PT వరకు పని చేస్తారు. TSR 711 మరియు భాష యాక్సెస్ సేవలు అందుబాటులో ఉన్నాయి.
సహాయం కోసం సంప్రదించడం మంచిదేనని గుర్తంచుకోండి. మీరు ఒత్తిడిని ఎలా ఎదుర్కుంటున్నారని మీ టీనేజ్ పిల్లలు గమనిస్తూ ఉంటారు. ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఆరోగ్యవంతమైన మార్గాలను కనుగొనడం మరియు మద్దతు అవసరమైనప్పుడు వాటికోసం సంప్రదించడం అనేవి మీకు మరియు మీ టీనేజ్ పిల్లలు నేర్చుకోవడానికి సానుకూలమైన చర్యలు.
మీ టీనేజ్ పిల్లల గురించి మీకు బాగా తెలుసు మరియు సవాళ్లతో కూడిన ఈ క్లిష్టమైన సమయంలో మీకు వారికి సహాయం చేయవచ్చు. మీరిద్దరూ కలిసి, మరింత బలంగా ఈ పరిస్థితినుండి బయటపడవచ్చు. మీకు మద్దతు అవసరమైతే, సంప్రదించండి!