Looking for more resources for supporting parents during COVID-19? Visit the Start Talking Now Facebook page.

తల్లిదండ్రులు మరియు సంరక్షకులు

You are here

Home » తల్లిదండ్రులు మరియు సంరక్షకులు

తెలుగులో పూర్తి సైట్‌ వీక్షించడానికి ఇక్కడ క్లిక్ చేయండి 

ఈ పేజీలో క్రిందివాటి గురించిన సమాచారం ఉంటుంది:

డ్రగ్స్ గురించి మీ టీనేజ్ పిల్లలు తీసుకునే నిర్ణయాలలో మీ ప్రభావం అత్యంత శక్తివంతమైనది.

స్నేహితుల కంటే ఎక్కువ. సెలబ్రిటీల కంటే ఎక్కువ. అందుకే టీనేజర్‌లు గంజాయి, ఆల్కహాల్ లేదా ఇతర మాదక పదార్థాలు ఉపయోగించకూడదని మీ నుండి వినడం మరియు కష్ట సమయాలను ఎదుర్కొవడానికి ఆరోగ్యకరమైన మార్గాలను కనుగొనడంతోపాటు ఆరోగ్యకరమైన ఎంపికలు చేయడం నేర్చుకోవడం వారికి చాలా ముఖ్యం.

ఈ విషయాల గురించి మీ టీనేజ్‌ పిల్లలతో మాట్లాడటం సవాలుగా ఉంటుంది, అయితే మీరు శ్రద్ధ చూపించడానికి, అంచనాలను సెట్ చేయడానికి మరియు వారిని సురక్షితంగా మరియు ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడటానికి మీరు చేయగలిగే ముఖ్యమైన విషయాల్లో ఇది కూడా ఒకటి అని పరిశోధన చూపుతోంది. మీరు మీ టీనేజ్‌ పిల్లలతో సమయం గడుపుతున్నప్పుడు సంభాషణలు సాధారణంగా, చిన్న చర్చలు కావచ్చు. ఈ రకమైన సంభాషణల కోసం మీరు సిద్ధం అయ్యేలా సాయ పడటానికి, మద్యం లేదా గంజాయి గురించి మీ పిల్లలు అడగగలిగే ప్రశ్నలకు సమాధానాల జాబితా ఇక్కడ ఉంది. అందరూ ఒకేలా ఉండరు, అయితే, మీ స్వంత అభిప్రాయాలు మరియు అనుభవాల ఆధారంగా మీ ప్రతిస్పందనలను రూపొందించాలని గుర్తుంచుకోండి. వ్యక్తిగతంగా మరియు నిజాయితీతో కూడిన సంభాషణను కలిగి ఉండటం మరింత శక్తివంతమైన ప్రభావాన్ని చూపిస్తాయి.

మీ టీనేజర్‌తో మాట్లాడటానికి మీకు సహాయ పడటానికి ఇక్కడ అదనపు వనరులు ఉన్నాయి:

తల్లిదండ్రులు మరియు సంరక్షకులకు చిట్కాలు.

మీ టీనేజ్‌ పిల్లలతో సమయం గడపండి, తరచుగా సంభాషణలు జరుపుకోండి మరియు కలిసి వినోదాత్మక పనులు చేయండి!

మీరు బంధంలో ఉన్నప్పుడు, హద్దులు పెట్టినప్పుడు మరియు పర్యవేక్షించేటప్పుడు గంజాయి, మద్యం లేదా ఇతర మాదక పదార్థాల వాడుకను నివారించేందుకు మీరు మీ టీన్స్ కి సాయపడవచ్చు.

సన్నిహితమైన బంధాలను ఏర్పరుచుకోండి.

తమ తల్లిదండ్రులు మరియు/లేదా సంరక్షకులు జోక్యం చేసుకున్నప్పుడు మరియు వారితో సన్నిహితంగా ఉండేటప్పుడు వారు గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలు సేవించడం లేదా ఉపయోగించే అవకాశాలు తక్కువగా ఉంటుంది. కుటుంబ అనుబంధాన్ని పెంచడానికి:

  • మీ పిల్లలకు ప్రతిరోజూ కనీసం 15 నిమిషాల సమయం ఇవ్వండి.
  • కలిసి సరదా పనులను చేయండి.
  • మీ బిడ్డ చేసే ఆరోగ్యవంతమైన ఎంపికల గురించి సానుకూల అభిప్రాయం తెలియజేయండి.
  • కలిసి భోజనం చేయండి.

స్పష్ట సరిహద్దులను నిర్ధారించండి.

స్పష్టమైన నియమాలను ముందుగానే సెట్ చేయండి, స్థిరంగా ఉండండి, మరియు మార్గదర్శకాల గురించి తరచుగా మాట్లాడండి. సరిహద్దులను సెట్ చేయడానికి:

  • మీ అంచనాల గురించి అప్పడప్పుడూ మాట్లాడుతూ ఉండండి.
  • మీ నియమాలు ఉల్లంఘించినప్పుడు, ఏ సమయంలోనైనా న్యాయమైన మరియు స్థిరమైన క్రమశిక్షణను వాడండి.
  • స్నేహితులతో సానుకూల సంబంధాలు ఏర్పరుచుకోవడానికి మీ పిల్లలకు సాయం చేయండి.
  • మాదక పదార్థాలకు నో అని చెప్పే విధానాలను మీ బిడ్డ అలవాటు చేసుకోవడానికి సాయం చేయండి.

కార్యకలాపాల పై పర్యవేక్షణ.

మీ టీనేజ్ పిల్లలు ఏమి చేస్తున్నారు, వారు ఎక్కడికి వెళుతున్నారు, ఎవరితో సమయం గడుపుతున్నారు అని ఎల్లప్పుడూ గమనిస్తూ ఉండండి. సురక్షితమైన మరియు వినోదాత్మకం ఉండే కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవడానికి వారికి సాయపడండి. ఈ ఐదు ప్రశ్నలు అడగడాలని గుర్తుంచుకోండి:

  • ఎక్కడికి వెళుతున్నావు?
  • నువ్వు ఏమి చేయబోతున్నావు?
  • నితో ఎవరు ఉంటారు?
  • నువ్వు తిరిగి ఇంటికి ఎప్పుడు వస్తావు?
  • అక్కడ ఆల్కహాల్మద్యం, గంజాయి, లేదా ఇతర మాదక పదార్థాలు ఉంటాయా?

చిన్న వయస్సులో ఆల్కహాల్, గంజాయి, మరియు ఇతర మాదకద్రవ్యాలను ఉపయోగించడం వల్ల కలిగే ప్రమాదాలు ఏమిటి?

ఆల్కహాల్, గంజాయి, మరియు ఇతర మాదకద్రవ్యాలకు చిన్న వయస్సులోనే అలవాటు చేసుకుని ఉపయోగించడం వల్ల టీనేజ్ పిల్లలు వ్యసనాలకు గురౌతారు మరియు వారికి ఇతర ఆరోగ్య సమస్యలు ఎదురౌతాయి, విద్య నేర్చుకోవడంలో విఫలమౌతారు, మరియు విద్యకు అడ్డగింపు ఏర్పడం వలన కెరీర్ ఎంపికలు పరిమితం అవుతాయి. గంజాయి, మద్యం, మరియు ఇతర మాదక ద్రవ్యాల వినియోగం:

  • అభివృద్ధి చెందుతున్న టీనేజ్ మెదడుకు హాని కలిగించవచ్చు. ఆల్కహాల్, గంజాయి, మరియు ఇతర మందులు మెదడులోని మోటారు సమన్వయం, ప్రచోదనాల నియంత్రణ, జ్ఞాపకశక్తి, నేర్చుకోవడం మరియు నిర్ణయాలను నియంత్రించే ప్రాంతాలను దెబ్బతీస్తాయి. టీనేజ్ మెదడు చాలా సున్నితంగా ఉండడంవలన, ఇది మరింత హాని కలిగిస్తుంది.
  • వ్యసనానికి దారి తీయవచ్చు. 15 ఏళ్ల వయస్సుకన్నా ముందుగానే మద్యం సేవించడానికి ప్రారంభించిన పిల్లలకు మద్య సంబంధిత సమస్యలు కలిగే అవకాశం పెద్దవారికన్నా నాలుగు రేట్లు ఎక్కువ ఉంటుంది మరియు 18 వయస్సుకు మునుపే గంజాయి వాడటానికి ప్రారంభించే వారు ఆలస్యంగా వాడటం మొదలు పెట్టిన వారికంటే నాలుగు నుంచి ఏడు రేట్లు గంజాయి వాడుక సంబంధిత సమస్యలకు గురయ్యే అవకాశం ఉంటుంది.
  • టీన్స్ మరణాలకు సంబంధించిన మొదటి మూడు కారణాలు: ప్రమాదాలు (రోడ్డు మరణాలు మరియు నీటిలో మునిగిపోవడం తో సహా) హత్య మరియు, ఆత్మహత్య.

చిన్న వయసులో మాదక పదార్థాల వాడుక వలన కలిగే ప్రమాదాల గురించిన వాస్తవాంశలను తెలుసుకోండి.

ఆరోగ్యకరమైన అలవాట్లను కలిసి పెంచుకోండి.

ఆరోగ్యకరమైన అలవాట్లు పెంచుకోవడానికి, లక్ష్యాలను సెట్ చేయడానికి మరియు ఎదుర్కోవడానికి ఆరోగ్యకరమైన మార్గాలను కనుగొనడంలో మీ టీన్ కు సాయపడండి.

  • లక్ష్యాలు సెట్ చేయండి: లక్ష్యాలను నిర్దేశించడం అనేది వ్యక్తులకు ఉద్దేశ్య భావాన్ని ఇస్తుంది మరియు సానుకూల భవిష్యత్తును నమ్మడంలో వారికి సహాయం చేస్తుంది. భవిష్యత్తు సవాలుగా ఉండవచ్చు, కానీ భవిష్యత్ అవకాశాల గురించి ఆశావాదం ఉన్నప్పుడు వాటిని నిర్వహించడం సులభం. మీ టీనేజ్ భవిష్యత్తులో వారు ఏమి చేయాలనుకుంటున్నారో దాని గురించి వారితో మాట్లాడండి మరియు ప్రణాళికలు రూపొందించడంలో వారికి సహాయం అందించండి.
  • ఆరోగ్యవంతమైన అలవాట్లను రూపొందించుకోవడం: బాగా తినడం, తగినంత నిద్రపోవడం మరియు వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యం మరియు మానసిక స్థితి మెరుగు పడుతుంది. మంచి అలవాట్లను సులభతరం చేసే పద్ధతులను (క్రమం తప్పని భోజన సమయాలు వంటివి) అందించండి మరియు ఆరోగ్యకరమైన అలవాట్లు ఎందుకు ముఖ్యమో మీ టీనేజ్‌ పిల్లలకు నచ్చచెప్పి వారితో మాట్లాడండి. కలిసి, మంచి అలవాట్లను బలోపేతం చేయడానికి మరియు సాధన చేయడానికి మార్గాలను రూపొందించండి.
  • ఎదుర్కొనే నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోండి: టీనేజ్‌ పిల్లలు ఒత్తిడికి గురైనప్పుడు లేదా ఆత్రుతగా ఉన్నప్పుడు వారికి మంచి అనుభూతిని కలిగించే కార్యకలాపాలను గుర్తించడం చాలా ముఖ్యం. యుక్తవయస్సులో, ఆ కార్యకలాపాలను వారి జీవితంలో అమలు పరచుకునే మార్గాలను కనుగొనండి-  అది రాత్రివేళ భోజనం చేసిన తర్వాత పెరట్లో బంతిని విసిరే ఆట ఆడటం, ఆరుబయట మాట్లాడుతూ నడవడం, రోజూ వారికి నచ్చిన కళలను అభ్యసించడం, లేదా విషయం అదుపు మించిందని అనిపించినప్పుడు 10 వరకు అంకెలు లెక్కపెట్టడం, మరియు గాఢంగా ఊపిరి పీల్చుకోవడం మొదలైనవి.

మద్దతు పొందండి.

సహాయం కోసం మీరు మరియు మీ టీన్ అడగడంలో తప్పేమీ లేదు! క్రింద ఇవ్వబడిన అన్ని వనరులు TSR 711 మరియు భాష యాక్సెస్ సేవలను అందిస్తాయి.

  • Teen Link అనేది ఒక ఉచిత, గోప్య హెల్ప్ లైన్, టీన్లు దీన్ని 6 నుంచి 10 p.m. PT వరకు కాల్ చేయడం, సందేశాలు పంపండం లేదా చాట్ చేయడం ద్వారా శిక్షణ పొందిన యువకులతో మాట్లాడవచ్చు. మీ పిల్లలు వారి మనసులో ఉన్న ఎటువంటి సంగతులున్నా వాటి గురించి మాట్లాడవచ్చు. 1-866-TEENLINK (833-6546)కు కాల్ చేయడానికి, టెక్స్ట్ చేయడానికి లేజా చాట్ చేయడానికి మీ పిల్లలను ప్రోత్సహించండి. మాదకపదార్థ వాడుక నివారణలో ప్రత్యేకత కలిగిన క్లినిషియన్ మాట్లాడటానికి Teen Link కి పెద్దలు కూడా కాల్ చేయవచ్చు. మరింత సమాచారం కోసం www.teenlink.org సందర్శించండి.
  • Washington Recovery Help Line అనేది ఒక అనామక, గోప్య 24-గంటలు పనిచేసే హెల్ప్ లైన్ మాదక పదార్థాల వాడుక సమస్యలు మరియు మానసిక ఆరోగ్య సవాళ్లతో పోరాడుతున్న వారికి ఇది మద్దతు అందిస్తుంది. మరింత సమాచారం పొందడం కోసం 1-866-789-1511 కి కాల్ చేయండి లేదా WARecoveryHelpLine.org సందర్శించండి.
  • Washington Listens విచారంగా, ఆత్రుతగా మరియు ఒత్తిడికి గురైన వారికి మద్దతు అందిస్తుంది. ఇది సోమవారం నుండి శుక్రవారం వరకు 9 a.m. నుంచి 9 p.m. PT మరియు వారాంతాల్లో 9 a.m. నుంచి 6 p.m. PT వరకూ పని చేస్తుంది. మరింత సమాచారం కోసం Washington Listens పోర్టల్ సందర్శించండి.